నీట్‌కు శిక్షణ ఇవ్వాలి: డీవీఈవో
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:51 PM
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ్ల ఈ ఏడాది నుంచి నీట్, ఐఐటీ, ఎంసెట్‌లో విద్యార్థులు రాణించేందుకు శిక్షణ ఇవ్వాలని డీవీఈవో సురేష్‌కుమార్, ఆర్‌ఐవో దుర్గారావు సూచించారు.
నరసన్నపేట, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ్ల ఈ ఏడాది నుంచి నీట్, ఐఐటీ, ఎంసెట్‌లో విద్యార్థులు రాణించేందుకు శిక్షణ ఇవ్వాలని డీవీఈవో సురేష్‌కుమార్, ఆర్‌ఐవో దుర్గారావు సూచించారు. మంగళవారం నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌కళాశాలను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అడ్మిష న్ల పెంచేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. మొదటి సంవత్సరం ప్రశ్నపత్రాల కూర్పులో బోర్డు మార్పుచేయడంలో విద్యార్థులకు అబ్జెక్టివ్ తరహా ప్రఽశ్నలపై తర్పీదు ఇవ్వాలని సూచించారు. అధ్యాపకుల టీచింగ్ డైరీ,నోట్స్, ఎండీఎం పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరపట్ల పవన్ పాల్గొన్నారు.
ఫ పాతపట్నం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణతో ఇష్టపూర్వకంగా చదవాలని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఆర్.సురేష్‌కుమార్, జిల్లాప్రాంతీయ పర్య వేక్షణాధికారి దుర్గారావు తెలిపారు.మంగళవారం పాతపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రికార్డులను పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో మాట్లా డారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ టి.హేమసుందరరావు ఉన్నారు.