Share News

Neet: నేడు నీట్‌

ABN , Publish Date - May 03 , 2025 | 11:31 PM

Medical Entrance Test జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఆదివారం యూజీ నీట్‌ నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలు వరకు నిర్వహిస్తారు.

Neet: నేడు నీట్‌

  • జిల్లాల్లో నాలుగు కేంద్రాల్లో పరీక్ష

  • మూడంచెల భద్రత నడుం నిర్వహణకు ఏర్పాట్లు

  • నరసన్నపేట, మే 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఆదివారం యూజీ నీట్‌ నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలు వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1.30 గంటల వరకు అనుమతిస్తారు. జిల్లాలోని ఎచ్చెర్లలో ఆర్‌జేయూకేటీ, గుజరాతీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, పెద్దపాడు రోడ్డులోని కేంద్రీయ విద్యాలయాన్ని పరీక్షా కేంద్రాలుగా కేటాయించారు. మూడంచల భధ్రత నడుం పరీక్షలను నిర్వహించనున్నారు. ‘అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్‌ కార్డు, గుర్తింపు పత్రం(ఆధార్‌కార్డు, పాన్‌కార్డు తదితరవి), పాస్‌ఫొటో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. నిర్ధేశిత సమయంలో చేరుకోవాలి. పరీక్షా కేంద్రంలోకి ఫోన్‌లు, క్యాలిక్యులేటర్లు, ఎలక్ర్టానిక్‌ పరికరాలు నిషేధం. దుస్తుల కోడ్‌ను పాటించాలి. సమాధానాలను బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే రాయాలి’ అని నిర్వాహకులు సూచించారు.

Updated Date - May 03 , 2025 | 11:31 PM