నారీశక్తి యాప్‌పై అవగాహన అవసరం
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:17 PM
నారీశక్తి యాప్‌పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే, విప్ బెందాళం అశోక్ అన్నారు. బుధవారం మండపల్లి పంచాయతీలో నారీశక్తి యాప్‌ను ప్రారం భించి, దాని ఆవశ్యకత, ప్రాధాన్యతను వివరించారు.
ఇచ్ఛాపురం, జూలై 16(ఆంధ్రజ్యోతి): నారీశక్తి యాప్‌పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే, విప్ బెందాళం అశోక్ అన్నారు. బుధవారం మండపల్లి పంచాయతీలో నారీశక్తి యాప్‌ను ప్రారం భించి, దాని ఆవశ్యకత, ప్రాధాన్యతను వివరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళల రక్షణకు ప్రభు త్వాలు అనేక చట్టాలు చేస్తున్నాయని, వీటిపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అనం తరం పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ శ్రీనివాస రావు, టీడీపీ నాయకులు పద్మనాభం, సూర్యనారాయణ, ఢిల్లీరావు, సహ దేవ్‌రెడ్డి, చంద్రశేఖర్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
వేధింపులపై అప్రమత్తంగా ఉండాలి
రణస్థలం, జూలై 16(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా ద్వారా మహిళలపై జరుగుతున్న వేధిం పులపై అప్రమ త్తంగా ఉండాలని డీఎస్పీ సీహెచ్ వివేకానంద అన్నారు. లెంకపేట కేజీబీవీ పాఠశాలలో బుధవారం నారీశక్తిపై అవగాహన కలిగించారు. మహిళా భద్రత, మహిళలపై జరుగుతున్న దాడులు, గృహ హింస శక్తి యాప్ ఉప యోగం తదితర అంశాలను వివరించారు. మహిళ సుర క్షిత ప్రయాణం కోసం ఆటోలకు సురక్ష క్యూ ఆర్ కోడ్ యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
శక్తియాప్‌తో రక్షణ
సోంపేట, జూలై 16(ఆంధ్రజ్యోతి): శక్తియాప్‌తో విద్యార్థినులకు నిరంతర రక్షణ ఉంటుందని, ప్రతి విద్యార్థి సెల్ ఫోన్‌లో శక్తియాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సీఐ మంగరాజు తెలిపారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు బుధవారం అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.మోహనరావు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు కృషి
సరుబుజ్జిలి, జూలై 16(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం శక్తియాప్‌పై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా సీఐ పి.సత్యనారాయణ మాట్లాడుతూ.. నేరాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్‌ఐ బి. హైమావతి మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు శక్తియాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. కార్య క్రమంలో శక్తి టీం ఏఎస్‌ఐ రమణమూర్తి, మోహన్‌రావు, ఉషారాణి వివిధ అంశాలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సి పాల్ పైడి పద్మావతి, ఎన్‌ఎస్‌ఎస్ పీవో రమేష్‌సాహు తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాకు బానిస కావొద్దు
పొందూరు, జూలై 16(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం యువత మాదక ద్రవ్యాలతో పాటు సోషల్ మీడియాకు బానిసై భవిష్యత్తును, జీవితాలను నాశనం చేసుకుంటు న్నారని, వీటికి దూరంగా ఉండాలని ఎస్‌ఐ వి.సత్యనారా యణ అన్నారు. స్థానిక ప్రభు త్వ జూనియర్ కళాశాలలో బుధవారం నారీశక్తి యాప్‌పై అవగాహన కలిగించారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సోషల్ మీడియా వల్ల మహి ళలే ఎక్కువగా బాధితులవు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ ఇందిర, విద్యార్థినులు పాల్గొన్నారు.