Share News

ఎంవీ చట్టంపై అవగాహన అవసరం

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:15 AM

మోటారు వాహన చట్టంపై వాహనచోదకులు అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉందని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు.

 ఎంవీ చట్టంపై అవగాహన అవసరం
మాట్లాడుతున్న హరిబాబు:

శ్రీకాకుళం లీగల్‌, నవంబరు10 (ఆంధ్రజ్యోతి): మోటారు వాహన చట్టంపై వాహనచోదకులు అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉందని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు. సోమవారం స్థానిక న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో మోటారు వాహన చట్టంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నడుపుతున్న వాహ నాలకు రిజిస్ట్రేషన్‌,ఫిట్‌నెస్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రమాదాలు జరిగే సమయంలో వాహనాలకు బీమా లేకపోవడంతో కోర్టుల్లో కేసులు త్యరగా పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలిపారు. అతివేగం, అర్హత లేకున్నా వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణాలని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే 10వేల రూపాయలు జరిమాన విధించనుననట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్‌పోర్ట్‌ కమిషనర్‌ ఎ. విజయసారధి, మోటార్‌ వెహికల్‌ ఇన్‌సెక్టర్‌ గంగాధర్‌, ఆర్టీసీ డిప్యూటీ మేనేజర్‌ సంతోష్‌కుమార్‌, న్యాయవాదులు ఇందిరాప్రసాద్‌,ఆఫీసు నాయుడు, ప్రైవేటు బస్సుల డ్రైవర్లు,ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు

Updated Date - Nov 11 , 2025 | 12:19 AM