కొత్త చట్టాలపై అవగాహన అవసరం
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:01 AM
Awareness of new laws కొత్త క్రిమినల్ చట్టాలపై న్యాయమూర్తులు, న్యాయవాదులకు సమగ్ర అవగాహన అవసరమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఘట్టమనేని రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఘట్టమనేని రామకృష్ణ ప్రసాద్
శ్రీకాకుళం లీగల్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): కొత్త క్రిమినల్ చట్టాలపై న్యాయమూర్తులు, న్యాయవాదులకు సమగ్ర అవగాహన అవసరమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఘట్టమనేని రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. శనివా రం శ్రీకాకుళంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో క్రిమినల్ చట్టాలపై కార్యశాలను ఆయన ప్రారంభించారు. అందరికీ ఒకేలా న్యాయం అందించడంలో న్యాయ మూర్తులు, న్యాయవాదుల సమష్టి కృషి అవసరమని తెలిపారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఘట్టమనేని రామకృష్ణ ప్రసాద్‌ను జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. జిల్లాకోర్టులో నెలకొన్న పలు సమస్యలను హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకె ళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని జిల్లా బార్ అసోసియే షన్ అధ్య క్షుడు తంగి శివప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో కార్యశాల రిసోర్స్ పర్సన్స్ ఏవీ పార్థసారధి, యు.సత్యారావు, జిల్లా న్యాయాధికారి జునైద్‌అహ్మద్ మౌలానా, జిల్లా అదనపు న్యాయాధికారులు పి.భాస్కరరావు, వివేకానంద శ్రీని వాస్, ఎస్. ఎం.ఫణికుమార్, తిరుమలరావు, పోక్సో న్యాయాధికారి నక్క సుజాత, సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎం.శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయా ధికారి కె.అనురాగ్, అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి జమృతబేగం, జిల్లాబార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి పిట్టా దామోదర్, ఉపాధ్యక్షులు సీతరాజు, మహి ళా ప్రతినిధి గురుగుబెల్లి వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.