Share News

కుటుంబ నియంత్రణపై అవగాహన అవసరం

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:45 PM

ప్రజలు కు టుంబ నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.అనిత అన్నారు.

కుటుంబ నియంత్రణపై అవగాహన అవసరం
అరసవల్లి: ర్యాలీలో పాల్గొన్న డీఎంహెచ్‌వో తదితరులు

అరసవల్లి, జూలై 11(ఆంధ్రజ్యోతి): ప్రజలు కు టుంబ నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.అనిత అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడురోడ్ల కూడలి వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు శారీరకంగా, మాన సికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే గర్భధారణ గురించి ఆలోచించాలన్నారు. 2011 నుంచి 2021 వరకు జననాల రేటు 6 శాతానికి తగ్గిందన్నారు. ప్రజారోగ్యా న్ని మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూ పొందించిందన్నారు. పెళ్లి వయసు పురుషులకు 25, స్త్రీలకు 21 సంవత్సరా లుండాలన్నారు. ఆడపిల్లల సంఖ్యను పెంచి, ఆడ, మగ సమతుల్యతను సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఐవో డా.రాందాసు, ఎస్‌వో రామ నాగేశ్వ రరావు, డెమో ఎం.వేంకటేశ్వరరావు, ఎస్‌.విజయలక్ష్మి, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

దేశాభివృద్ధిలో మానవవనరుల పాత్ర కీలకం

పొందూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): దేశాల అభివృద్ధిలో మానవ వనరుల పాత్ర అత్యంత కీలకంగా మారిందని పొందూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ మధుసూదనరావు అన్నారు. శుక్ర వారం కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ వాసుదేవరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 11:45 PM