ప్రశాంతంగా నవోదయ పరీక్ష
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:27 PM
Navodaya exam జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో 35 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 7,936 మంది విద్యార్థులకుగాను 6,946 మంది(87.52 శాతం) హాజరయ్యారు.
87.52 శాతం విద్యార్థుల హాజరు
నరసన్నపేట/ సరుబుజ్జిలి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో 35 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 7,936 మంది విద్యార్థులకుగాను 6,946 మంది(87.52 శాతం) హాజరయ్యారు. వీరిలో బాలురు 3,624 మంది, బాలికలు 3,322 మంది ఉన్నారు. 990 మంది పరీక్షలకు గైర్హాజయ్యారని నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ డి.బేతన్నస్వామి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నవోదయ విద్యాలయ అధ్యాపకులు పర్యవేక్షణ చేపట్టారు. ఈ ఏడాది ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో శతశాతం మార్కులు సాధించేవారి సంఖ్య అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాలు వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.