Share News

సంపూర్ణ అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:55 PM

సంపూర్ణ అక్షరాస్యత తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

సంపూర్ణ అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి
సైన్స్‌ ల్యాబ్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యో తి): సంపూర్ణ అక్షరాస్యత తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.సింగుపురం జిల్లా పరిషత్‌ పాఠశాలలో సోమ వారం అక్షరాస్యత దినోత్స వం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. నిరక్ష్యరాస్యత కారణంగా సమాజం అభివృద్ధి చెందడం లేదన్నారు. విద్యతోనే మన హక్కులు కాపాడుకోగలమని పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలో సైన్సు, మ్యాథ్స్‌ ల్యాబ్‌ లను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గుండ అదిత్య నాయుడు, ఎంపీటీసీలు, విద్యా కమిటీ చైర్మన్‌, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 11:55 PM