నాగావళి రివర్ వ్యూ పార్కు ఆధునికీకరణ
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:42 PM
నగరంలోని నాగావళి రివర్ వ్యూ పార్కును ఆధునికీకరిస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
అరసవల్లి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): నగరంలోని నాగావళి రివర్ వ్యూ పార్కును ఆధునికీకరిస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సోమవారం స్థానిక శాంతినగర్ కాలనీలోని రివర్ వ్యూ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు అందరినీ ఆకట్టుకునేలా ఆహ్లాదకరంగా పార్కును తీర్చిదిద్దుతామన్నారు. దోబీ ఘాట్ పక్కన జవాన్ పార్కును కూడా అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే ఈ విషయమై కలెక్టర్‌తో చర్చించామన్నారు. కార్యక్రమంలో రజక సంఘ డైరెక్టర్ దుర్గారావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.