Share News

పాఠశాలల్లో ‘ముస్తాబు’

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:24 AM

The school surroundings are cleaning ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ముస్తాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు శుభ్రమైన దుస్తులు ధరించి... పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టారు.

పాఠశాలల్లో ‘ముస్తాబు’
ఎచ్చెర్ల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

ఎచ్చెర్ల, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ముస్తాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు శుభ్రమైన దుస్తులు ధరించి... పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టారు. ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో శనివారం ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌ పాల్గొని ముస్తాబు కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలో నిర్మించిన 15 మరుగుదొడ్లను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త యశోదలక్ష్మి, ప్రిన్సిపాల్‌ పి.పద్మజ, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:24 AM