Share News

క్రమశిక్షణ, సమర్థతతో పనిచేయాలి

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:29 PM

క్రమ శిక్షణ, సమర్థతతో విధులు నిర్వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.

క్రమశిక్షణ, సమర్థతతో పనిచేయాలి
కోర్టు కానిస్టేబుళ్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): క్రమ శిక్షణ, సమర్థతతో విధులు నిర్వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసు ల విచారణలో కోర్టు సంబంధిత వ్యవహారాలు వేగ వంతం, కేసుల చార్జిషీట్ల దాఖలులో లోపాలు లేకుండా చూడాలన్నారు. నిందితుల హాజరు, సమన్లు, వారెంట్ల అమలు తదితర అంశాలపై శ్రద్ధ వహించాలన్నారు. నిర్ణీ త సమయంలో ముఖ్యమైన కేసుల చార్జిషీట్‌లు కోర్టులో దాఖలు చేయాలన్నారు. కేసుల విచారణ సమయంలో సాక్షులు హాజరుపర్చడం, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో సమ న్వయం ముఖ్యమన్నారు. కేసుల రికార్డులను సక్రమంగా నిర్వహించడం కోర్టు కానిస్టేబుళ్ల బాధ్యత అని అన్నారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:29 PM