Share News

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:32 AM

మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిం చాలని వార్డు, గ్రామ మహిళా పోలీసులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు.

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి
మహిళా పోలీసులతో మాట్లాడుతున్న ఎస్పీ

  • వార్డు, గ్రామ మహిళా పోలీసులకు సూచించిన ఎస్పీ

శ్రీకాకుళం క్రైం, జూన్‌ 2(ఆంధ్ర జ్యోతి): మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిం చాలని వార్డు, గ్రామ మహిళా పోలీసులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో ఉన్న మహిళా పోలీసుల బదిలీల కౌన్సెలింగ్‌ బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 850 మంది వార్డు, గ్రామ మహిళా పోలీసులు జిల్లాలో ఉండగా 350 మందిని కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటరమణ, డీఎస్పీ వివేకానంద పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:32 AM