సేవా దృక్పథం కలిగి ఉండాలి
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:42 PM
జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) వలంటీర్లు సేవాభావం కలిగి ఉండి దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధికారి డాక్టర్ ఎం.సుధాకర్ అన్నారు.
ఎచ్చెర్ల, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) వలం టీర్లు సేవాభావం కలిగి ఉండి దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధికారి డాక్టర్ ఎం.సుధాకర్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఆర్జీయూ కేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లలో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవాన్ని వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సేవాభావం, సామా జిక బాధ్యత, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని, ఇదే ఉద్దేశంతో ఎన్‌ఎస్ ఎస్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిం చి బహుమతులు అందించారు. కార్యక్రమాల్లో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య, పూర్వపు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత, ఎన్‌వైకే ఉప సంచాలకుడు కె.వెంకట ఉజ్వల్, ఎన్‌వైకే కోఆర్డినేటర్ డాక్టర్ డి.వనజ, బెజ్జిపురం యూత్‌క్లబ్ డైరెక్టర్ ఎం. ప్రసాదరావు, వర్సిటీ ప్రిన్సిపాళ్లు ఎం.అనూరాధ, సీహెచ్ రాజశేఖరరావు ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ కేవీజీడీ బాలాజీ, ఏవో డాక్టర్ ముని రామకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ పి.ముకుందరావు, డీన్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి దశ నుంచే..
కవిటి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశనుంచే సేవాభావాన్ని అలవర్చుకోవా లని ప్రిన్సిపాల్ కె.సింహాచలంనాయుడు అన్నారు. కవిటి ప్రభుత్వ జూనియర్ కళాశా లలో బుధవారం ఎన్‌ఎస్ ఎస్ దినోత్సవాన్ని నిర్వహించారు. చదువుతోపాటు సమాజా భివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరులుగా మా రాలని, దీనికి ఎన్‌ఎస్‌ఎస్ దోహదపడుతుందన్నారు. అలాగే ఫ్రెషర్స్ డే నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ పి.లక్ష్మణరావు, నేతలు ఎ.మధు, వి.రంగారావు, ఎ.రాజు, బి.తిరుమలరావు పాల్గొన్నారు.