హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - May 02 , 2025 | 12:02 AM
కార్మికుల సంక్షేమం కోసం రూపొందించబడిన హక్కుల పై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి బి.నిర్మల అన్నారు.
టెక్కలి, మే 1(ఆంధ్రజ్యోతి): కార్మికుల సంక్షేమం కోసం రూపొందించబడిన హక్కుల పై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి బి.నిర్మల అన్నారు. గురువారం టెక్కలి ఆర్టీసీ డిపోలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్మిక హక్కు లు, చట్టాలను వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్, న్యాయవాదులు చంద్రశేఖర్ పట్నాయక్, పొట్నూరు ఆనందరావు, ఎస్‌ఐ రాము, డిపో మేనేజర్ శ్రీనివాసరావు, గోపాలకృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సమాన పనికి సమాన వేతనం అందించాలి
కొత్తూరు, మే 1(ఆంధ్ర జ్యోతి): వివిధ రంగాల్లో కార్మి కులకు సమాన పనికి సమాన వేతనం అందించేలా యాజ మాన్యాలు చర్యలు తీసుకోవా లని జూనియర్ సివిల్ న్యాయాధికారి కె.రాణి కోరారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా గురువారం మెట్టూ రు జీడి ఫ్యాక్టరీ ఆవరణలో రైసుమిల్లు, జీడి కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్మికులు తమ పిల్లలను చది వించాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు ఎం.అప్పారావు, చల్లా రవికుమార్, ప్రభుత్వ ప్లీడర్ రాడ రాజు, గేదల ఫల్గుణరావు, అరుబోలు ధర్మారావు, రమేష్ తదితరలు పాల్గొన్నారు.
కార్మికులకు ఉచిత న్యాయ సహాయం
పలాస, మే 1(ఆంధ్రజ్యోతి): అసంఘటిత, పరిశ్ర మల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉచిత న్యాయ సహాయం అంది స్తామని, దీనిని సద్వి నియోగం చేసుకోవాలని పలాస మున్సిఫ్ న్యాయాధికారి యు.మాధురి కోరారు. గురు వారం స్థానిక కోర్టు ఆవరణలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ప్రసూతి బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారని, అటువంటి వారు తమ వివరాలను లేబర్ కార్యాలయంలో నమోదు చేసుకోవాల న్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫయ్యజ్ అహ్మద్ (ఘని), ఉపాధ్యక్షుడు బీకేఆర్ పట్నాయక్, న్యాయవాదులు జీఎంఎస్ అనిల్‌రాజు, పైల రాజరత్నం నాయుడు, వై.హేమకుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.