జాతీయ స్థాయిలో సత్తాచాటాలి
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:17 AM
జాతీయ స్థాయిలో సత్తాచాటి మన్యం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆకాంక్షించారు.
పార్వతీపురం రూరల్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో సత్తాచాటి మన్యం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆకాంక్షించారు. బుధవారం పార్వతీపురంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో జాతీయ స్థాయి క్రీడా పోటీలను ఎంపికైన జిల్లాకు చెందిన విద్యార్థినులను విజయచంద్ర అభినందించారు. గత నెల 24, 25 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగిన పోటీల్లో సత్తాచాటి పార్వతీపురం మండలంలోని బందలుప్పి గ్రామానికి చెందిన బి.వినీత జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైంది. అలాగే జి.లాస్యప్రియ కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో వీరిద్దరిని అభినందించారు. కార్యక్రమంలో కోచ్ ఉమామహేశ్వరరావుపాల్గొన్నారు.
బెలగాం, డిసెంబరు10 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలోని చర్చి సెంటర్‌లో దివంగత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటుచేసేందుకు ఎమ్మెల్యే విజయచంద్ర స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఉన్నారు.