Share News

పాలవలసలో యువకుడి హత్య

ABN , Publish Date - May 19 , 2025 | 12:05 AM

మండలంలోని పాలవలసలో ఓ యువకుడి హత్యతో కలకలం నెలకొంది. వారం రోజులుగా సంబరాలు జరుగుతున్న సమయంలో హత్య జరగడంతో ఆదివారం ఉద యం గ్రామం ఉలిక్కి పడింది.

పాలవలసలో యువకుడి హత్య
ఈశ్వరరావు మృతదేహం

సోంపేట, మే 18 (ఆంధ్రజ్యోతి): మండలం లోని పాలవలసలో ఓ యువకుడి హత్యతో కలకలం నెలకొంది. వారం రోజులుగా సంబ రాలు జరుగుతున్న సమయంలో హత్య జరగడంతో ఆదివారం ఉద యం గ్రామం ఉలిక్కి పడింది. సోంపేట సీఐ మంగరాజు, బారువ ఎస్‌ఐ హరిబాబు నాయుడు, గ్రామస్థుల కథనం మేరకు.. పాలవలసకి చెందిన గోకర్ల ఈశ్వరరావు(38) అందరితో కలివిడిగా ఉండేవాడు. ఎవరితో ఎటువంటి తగాదాలు లేవు. ఈశ్వరరావు శనివారం రాత్రి ఇంటి నుంచి బయలు దేరి సంబరానికి వెళ్లాడు. రాత్రి 12 గంటల నుంచి కని పించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. ఆదివారం ఉదయం గ్రామా నికి సమీపంలోని తోటల్లో విగత జీవిగా పడిఉండాన్ని గుర్తించారు. ఈశ్వరరావును ఎవరో గాజు సీసాతో పీకపై కోసిపడేసినట్లు, మెడ ఎడమ చెవి, తలపైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. నుదురుపైన గాయాలు కనిపిస్తున్నాయి. రాత్రివేళ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం నుంచి ఈశ్వరరావు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరితో ఉన్నాడన్న విషయాలను సేక రిస్తున్నారు. శనివారం రాత్రి భోజనం తరువాత ఎవరెవరిని కలి శాడు. అన్నవిషయాలపై ఆరా తీస్తున్నారు. పాత గొడవలతో పాటు ఆర్థిక లావా దేవీలు, ఇతర విషయాలపైౖ కూడా ఆరా తీస్తున్నారు. కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు సంఘటన స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. అన్ని కోణా ల్లో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఈశ్వరరావు రంగులు వేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయనకు భార్య పార్వతి, రెండేళ్ల పాప ఉంది.

Updated Date - May 19 , 2025 | 12:05 AM