Share News

ఫరీద్‌పేటలో పట్టపగలే హత్య

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:08 AM

ఎచ్చెర్ల మండలంలో అత్యంత సమస్యాత్మక గ్రామమైన ఫరీద్‌పేట పరిధిలో పట్టపగలే శుక్రవారం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.

ఫరీద్‌పేటలో పట్టపగలే హత్య
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

  • మృతుడి బంధువుల నిరసన

  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

రణస్థలం, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండలంలో అత్యంత సమస్యాత్మక గ్రామమైన ఫరీద్‌పేట పరిధిలో పట్టపగలే శుక్రవారం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త, ఎంపీపీ మొదలవలస చిరంజీవి అనుచరుడు సత్తారు గోపి(46) హత్య గ్రామం లోనే కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో గోపి, మరో వ్యక్తి కోటేశ్వరరావుతో కలిసి బైక్‌పై కొయ్యరాళ్లు కూడలి నుంచి సర్వీసు రోడ్‌లో ఎచ్చెర్ల వైపు వెళ్తుండగా, అదే రోడ్‌లో ఉన్న ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు మూకుమ్మడిగా దాడిచేయగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌ వెనుక కూర్చొన్న కోటేశ్వరరావు ఈ ఘటనను చూసి అక్క డి నుంచి పరుగులు తీశాడు. సమాచారం అందు కున్న జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం, ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్‌ కుమార్‌, సిబ్బంది ఘటనా స్థలా నికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎంపీపీ మొదలవలస చిరంజీవి, మృతుడి కుటుంబ స భ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామంలో పోలీ స్‌ పికెట్‌ కొనసాగుతుండగానే హత్య జరగడంపై వారంతా నిరసన వ్యక్తంచేశారు. జాతీయ రహదా రిపై బైఠాయించి బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. డీఎస్పీ వివేకానం ద ఆందోళనకారులతో మాట్లాడి బాధ్యులపై చర్య లు తీసుకుంటామని సర్దిచెప్పి శాంతింపజేశారు.

మృతదేహం పక్కనే..

కొయ్యరాళ్లు జంక్షన్‌కు సమీపంలో సర్వీసు రోడ్‌లో బైక్‌పై ఎచ్చెర్ల వైపు వెళ్తున్న సత్తారు గోపి దుండగులు అడ్డగించి దాడిచేశారు. ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు గోపి పరుగులు తీసి నా వెంబడించి మరీ హతమార్చారు. మృతదేహం వద్దనే కర్ర , ఇటుక పడి ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని క్లూస్‌ టీమ్‌ సందర్శించి వివరాలు సేకరిం చింది. మృతుడిపై గతంలో పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. పాత కక్షలతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య సుగుణ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య సుగుణ గ్రామ ఉప సర్పంచ్‌గా ఉన్నారు. మృతుడు గతంలో జడ్పీ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఎస్పీ సందర్శన..

ఘటనా స్థలాన్ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సం దర్శించి పరిస్థితిని సమీక్షించారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. గ్రామంలో పర్యటించి పో లీస్‌ పికెట్‌ను మరింత పటిష్ఠంగా నిర్వహిం చేందుకు సూచనలు చేశారు. మరింత పోలీసు బందోబస్తును పెంచారు.

కొన్నేళ్లుగా సమస్యాత్మకమే..

ఎచ్చెర్ల మండలంలో ఫరీద్‌పేట కొన్నేళ్లుగానే సమస్యాత్మక గ్రామంగానే గుర్తింపు ఉంది. గతం లో ఈ గ్రామంలో హత్యలు కూడా జరిగాయి. మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు కోటి పాత్రుని పోలినాయుడు, మొదలవలస రాంబాబు, కూన ప్రసాద్‌ హత్యకు గురికాగా, తాజాగా సత్తారు గోపి హత్యకు గురవడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే టీడీపీ నేత, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొత్తకోట అమ్మినాయుడుపై కూడా గతంలో హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు పోలీ సులు మరింత అప్రమత్తం కావాల్సి ఉంది.

Updated Date - Jul 12 , 2025 | 12:08 AM