పథకం ప్రకారమే హత్య
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:16 AM
స్నేహితుడి చేతి లో హత్యాయత్నా నికి గురై ఆసుప త్రిలో చికిత్స పొందుతూ మృ తి చెందిన ఘట నలో నిందితుడు దమరసింగు గొల్లబాబు అలియాస్ శంకర్‌ను సోమవారం అరెస్ట్ చేసి పొందూరు కోర్టులో హా జరుపరచగా న్యాయాధికారి రిమాండ్ విధించినట్లు జేఆర్‌పురం సీఐ ఎం.అవతా రం తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజశేఖర్ మృతి
నిందితుడి అరెస్టు.. మారణాయుధాలు స్వాధీనం
వారంలోనే కేసును ఛేదించిన పోలీసులు
జి.సిగడాం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): స్నేహితుడి చేతి లో హత్యాయత్నా నికి గురై ఆసుప త్రిలో చికిత్స పొందుతూ మృ తి చెందిన ఘట నలో నిందితుడు దమరసింగు గొల్లబాబు అలియాస్ శంకర్‌ను సోమవారం అరెస్ట్ చేసి పొందూరు కోర్టులో హా జరుపరచగా న్యాయాధికారి రిమాండ్ విధించినట్లు జేఆర్‌పురం సీఐ ఎం.అవతా రం తెలిపారు. ఈ మేరకు పొందూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. గత నెల 24న గెడ్డకంచరాం గ్రామ సమీ పంలో అదే గ్రామానికి చెందిన పుక్కళ్ల రాజశేఖర్‌పై స్నేహితుడు గొల్లబాబు పథ కం ప్రకారమే హత్యకు ప్రయత్నించాడన్నారు. వీరిద్దరూ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడి రాజశేఖర్‌ని చంపాలనే పన్నాగంతో గొల్లబాబు ఆగస్టులో కత్తులను తెప్పించుకుని ఉంచుకున్నాడన్నారు. అదే గ్రామానికి చెందిన పెయింటింగ్ మేస్త్రీ ఎం.అప్పన్న తన సమీప బంధువు అప్పలస్వామి కుమార్తె పెళ్లి ఫంక్షన్‌కి పిలువగా.. రాజ శేఖర్‌తో పాటు పలువురు వెళ్లారు. రాజశేఖర్ తదితరులు అప్పటికే మద్యం సే వించగా గొల్లబాబు ఆలస్యంగా వెళ్లి మద్యం అడగడంతో తాము అప్పటికే తాగే శామని, అయిపోయిందని చెప్పడంతో గొడవకు దిగారు. ఈ గొడవనే అవకాశం గా తీసుకుని శంకర్.. తన ఇంటివద్ద ఉంచిన కత్తులను తీసుకువచ్చి స్నేహితుల కు ఫోన్ చేశాడు. వారు ఫోన్ ఎత్తకపోగా లక్ష్మణ అనే వ్యక్తికి ఫోన్ చేసి రాజశేఖ ర్ ఎక్కడ ఉన్నాడని అడగడంతో ఎందుకు గొడవలంటూ అతడిని వారించాడు. ఈ నేపథ్యంలో రాజశేఖర్, లక్ష్మణ నడుచుకుంటూ గెడ్డకంచరాం వచ్చారు. గ్రామ కూడలి వద్ద రాజశేఖర్.. శంకర్ ఎదురుపడి వాదులాడుకున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ కడుపులో పదునైన కత్తితో శంకర్ పొడిచాడు. దీంతో పేగులు బయట కు వచ్చాయి. వెంటనే లక్ష్మణ రాజశేఖర్‌ను బైక్‌పై జి.సిగడాం పీహెచ్‌సీకి తీసకు వెళ్లి ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తర లించగా అక్కడ చికిత్స పొందుతూ 25వ తేదీన మృతి చెందాడు. కాగా గొబ్బూరు గ్రామ సమీపంలో జి.సిగడాం ఎస్‌ఐ మధుసూదనరావు, రెవెన్యూ అధికారుల స మక్షంలో నిందితుడు శంకర్‌ను విచారించి అతని ఇంటిలో ఉన్న మారణాయు ధాలను స్వాధీనం చేసుకున్నారు. రాజశేఖర్ భార్య పుక్కళ్ల హరిప్రియ ఇచ్చిన ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పొందూరు కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి జ్యోత్స్న రిమాండ్ విధించి నట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐ వై.మధుసూదనరావు, సిబ్బంది పాల్గొన్నారు.