Share News

మునిసిపల్‌ కార్మికుల నిరసన

ABN , Publish Date - Jun 26 , 2025 | 11:57 PM

:పనికి తగిన పనిముట్లు ఇవ్వాలని, పీఎఫ్‌ డబ్బులు కార్మికుల ఖాతాలో జమచేయాలని, చనిపోయిన, రిటైర్‌ అయిన వారి కుటుంబ సభ్యు లకు ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యిదర్శి గణపతి, మునిసిపల్‌ యూని యన్‌ వర్కర్స్‌ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్‌,కూర్మారావు,మురుగన్‌ డిమాండ్‌ చేశారు.

మునిసిపల్‌ కార్మికుల నిరసన
గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న మునిసిపల్‌ కార్మికులు:

కాశీబుగ్గ, జూన్‌26(ఆంధ్రజ్యోతి):పనికి తగిన పనిముట్లు ఇవ్వాలని, పీఎఫ్‌ డబ్బులు కార్మికుల ఖాతాలో జమచేయాలని, చనిపోయిన, రిటైర్‌ అయిన వారి కుటుంబ సభ్యు లకు ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యిదర్శి గణపతి, మునిసిపల్‌ యూని యన్‌ వర్కర్స్‌ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్‌,కూర్మారావు,మురుగన్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కాశీబుగ్గలోని గాంధీ విగ్రహం వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని పాడైన పనిముట్లతో కార్మికులు నిరసన తెలిపారు.కార్యక్రమంలో మునిసిపల్‌ కార్మికులు ఈశ్వరరావు, బాలకృష్ణ, రమేష్‌, తిరుపతి, ముఖి, ఢిల్లీ,అమర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:57 PM