Share News

ముంబైకి గంజాయి తరలిస్తూ..

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:59 PM

కంచిలి రైల్వేస్టేషన్‌ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండ గా ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని, వారి నుంచి 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సోంపేట సీఐ మంగరాజు, కంచిలి ఎస్‌ఐ పి.పారినాయిడు తెలిపారు.

ముంబైకి గంజాయి తరలిస్తూ..
నిందితులతో సీఐ మంగరాజు, ఎస్‌ఐ పారినాయుడు

  • ఇద్దరు అరెస్టు.. 24 కిలోల సరుకు స్వాధీనం

కంచిలి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): కంచిలి రైల్వేస్టేషన్‌ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండ గా ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని, వారి నుంచి 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సోంపేట సీఐ మంగరాజు, కంచిలి ఎస్‌ఐ పి.పారినాయిడు తెలిపారు. ఈ మేరకు శనివారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఒడిశాకి చెందిన మిలన్‌ బీర.. పిన్ని వరుస అయిన దీపాలిబిదేశీ లిమాతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా కంచిలి రైల్వేస్టేషన్‌ వద్ద పోలీసులు తనిఖీ చేప ట్టారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న 12 ప్యాకెట్లలో 24 కిలోల గంజాయి ఉన్న ట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రం ఆర్‌.ఉదయగిరికి చెందిన రాజు వద్ద గంజాయిని ఈ నెల 3న కొనుగోలు చేసి ముంబైలో ఉన్న శంకర్‌ అనే వ్యక్తికి అందించేందుకు నిందితులు తెలిపినట్టు సీఐ తెలిపారు. సాయంత్రం కోణార్క్‌ రైలులో తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. గంజాయి రవా ణాను చాకచక్యంగా అడ్డుకున్న ఎస్‌ఐ పారినాయుడు, సిబ్బందిని సీఐ అభినందించారు.

Updated Date - Dec 13 , 2025 | 11:59 PM