కార్మికుల హక్కులకోసం ఉద్యమాలు
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:15 PM
కార్మికవర్గం త్యాగాలతో పోరాడి సాధించుకున్న హక్కులు పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు చేపడతామని సీఐ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు తెలిపారు.
సోంపేట, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కార్మికవర్గం త్యాగాలతో పోరాడి సాధించుకున్న హక్కులు పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు చేపడతామని సీఐ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు తెలిపారు. ఆదివా రం సోంపేటలో సీఐటీయూ జిల్లా మహాసభల్లో భాగంగా జిల్లా అధ్యక్షు డు సీహెచ్‌అమ్మన్నాయుడు అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. కాగా ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ అధ్యక్షుడిగా సీహెచ్‌అమ్మన్నాయుడు, ప్రధానకార్యదర్శిగా పి.తేజే శ్వరరావు, కోశాధికారిగా అల్లు సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా కె.నాగ మణి, అల్లుమహాలక్ష్మి, కె.సూరయ్య, డి.గోవిందరావు, బి.ఉత్తర, కార్యదర్శు లుగా సంగారు లక్ష్మీనారాయణ, ఎన్.గణపతి,రమణతోపాటు 64మందితో కార్యవర్గం ఎన్నుకున్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
దుర్గాగణేష్ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక
కవిటి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నకర్రివానిపాలెంలో దుర్గాగణేష్ సేవాసంఘం కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడి గా సూర్ని రమేష్,కార్యదర్శిగా సీహెచ్ బోస్, ఉపాధ్యక్షుడిగా ఎస్.ముకుంద, సహాయకార్యదర్శిగా బి.మధు, కోశాధికారిగా జయబాబును ఎన్నుకున్నారు.