పోలీసుల డైరీలో ‘మోస్ట్ వాంటెడ్’ నేరగాడు
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:12 AM
జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆరు భాషల్లో మాట్లాడుతూ ఇళ్లకు కన్నం వేస్తూ పోలీసుల డైరీలో ‘మోస్ట్ వాంటెడ్’గా స్థానం పొందాడు.
శ్రీకాకుళం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆరు భాషల్లో మాట్లాడుతూ ఇళ్లకు కన్నం వేస్తూ పోలీసుల డైరీలో ‘మోస్ట్ వాంటెడ్’గా స్థానం పొందాడు. వివరాలిలా ఉన్నాయి.. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మెళియా పుట్టి మండలం చాపర రెల్లి వీధికి చెందిన దున్న కృష్ణ(50) ఇళ్లకు కన్నం వేయడం లో ఆరితేరాడు. జిల్లాలో పలుచోట్ల ఇతనిపై కేసులు నమోదయ్యాయి. ఇక్కడి నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రం నీసల్ మసీద్ పక్కన టూస్య వీధిలో మకాం మార్చాడు. అక్కడి నుంచి వస్తూ.. వెళ్తూ.. జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఆ అనుభవంతో తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, ఒడియా, తమిళ భాషలను నేర్చుకుని ప్రజలను ఏమార్చి చోరీలకు పాల్పడేవాడు. పోలీ సులకు చిక్కకుండా తిరుగు తున్నాడు. ఇతనిపై శ్రీకాకు ళం టూటౌన్, రూరల్ స్టేషన్ లో కేసులు పెండింగ్ ఉన్నా యి. కృష్ణ సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియ జేయా లని.. నగదు బహుమతి ఇస్తా మని ప్రకటించారు. సమాచారం తెలిసినవారు పోలీస్ కంట్రోల్ రూం 63099 90933 నెంబరుకు తెలియజేయాలని పోలీసులు ప్రకటించారు.