పరిసరాల పరిశుభ్రతతో దోమల నివారణ
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:34 PM
పరిసరాల పరిశుభ్రతతో దోమలను నివారించవచ్చునని ఉర్లాం పీహెచ్‌సీ వైద్యురాలు షాలిని అన్నారు.
నరసన్నపేట, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రతతో దోమలను నివారించవచ్చునని ఉర్లాం పీహెచ్‌సీ వైద్యురాలు షాలిని అన్నారు. బుధవారం ప్రపంచ దోమలు నివారణ దినం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ర్యాలీ తూతూ మంత్రంగా చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో తిరగాల్సిన సిబ్బంది కేవలం పీహెచ్‌సీ ఆవరణలో ర్యాలీ చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి.
వరద నీరు నిల్వ లేకుండా చూడాలి
పలాసరూరల్,ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ప్రపంచ దోమల నివారణ దినం సందర్భంగా బుధవారం రెంటి కోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రెంటికోటలో అవగాహన సదస్సు, ర్యాలీ చేపట్టారు. వర్షాకాలం లో వరద నీరు నిల్వ లేకుండా చూడాలని, దోమ తెరలను వాడుకోవాలని, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని గ్రామస్థులకు సూచించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో ఆదమ్మ, ఫార్మసీ అధికారి బోనెల గోపాల్, సూపర్‌వైజరు కోటేశ్వరరావు, స్టాఫ్‌నర్స్ రాజేశ్వ రి పాల్గొన్నారు.
పోలాకిలో..
పోలాకి ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): పోలాకి, గుప్పెడుపేట ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ దోమల నివారణ దినం నిర్వహించారు. వైద్యాధికారి శ్రీనాథ్, విస్తరణాధికారి నల్లిరవికుమార్, నర్సింగ్ ట్రైనీలు, ఏఎన్‌ఎంలు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.