Share News

సాగులో ఆధునిక పద్ధతులను పాటించాలి: అశోక్‌

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:36 PM

సాగులో ఆధునిక పద్ధ తులను పాటించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బి.అశోక్‌ అన్నారు.

సాగులో ఆధునిక పద్ధతులను పాటించాలి: అశోక్‌
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

కవిటి, సెప్టెంబరు2(ఆంధ్రజ్యోతి): సాగులో ఆధునిక పద్ధ తులను పాటించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బి.అశోక్‌ అన్నారు. మంగళవారం స్థానిక చికాఫ్‌ సంస్థ కార్యాలయంలో కొబ్బరి దినోత్సవం సందర్భంగా రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో ఉద్యానవనశాఖ ద్వారా నియమితులైనవారు ఎంతవరకు రైతులకు సాయం చేస్తున్నారో పరిశీలించాలని ఉద్యా నవన శాఖ ఏడీ చిట్టి బాబును ఆదేశించారు. వ్యవసాయాధార పరి శ్రమలను నెల కొల్పి రైతులను వ్యాపారవేత్తలుగా చేయాలన్న ఆలోచన చేస్తుంటే ఆ మరునాడే ఓ పత్రికలో పేదల భూములు లా క్కుంటున్నానని వార్తలు రాయించారన్నారు. రైతు ల సంక్షే మం కోసం పనిచేస్తుంటే కొందరు స్వార్థపరులు ఇలా తయా రయ్యారని ఆగ్రహం వ్యక్తంచే శారు. కొబ్బరి పంటలను కాపా డుకునేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో చికాఫ్‌ చైర్మన్‌ జోహార్‌ఖాన్‌, ఏఎంసీ చైర్మన్‌ మణిచంద్ర ప్రకాష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాసుదేవ్‌ ప్రదాన్‌, కవిటి, కంచిలి టీడీపీ మండల అధ్యక్షులు పి.కృష్ణారావు, ఎం.రామారావు, ఉద్యానవన శాఖాధికారి పి.మాధవీలత, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:36 PM