దక్షిణ భారత సైన్స్ ఫెయిర్‌కు మోడల్ పాఠశాల విద్యార్థి
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:53 PM
స్థానిక మోడల్ పాఠశాలకు చెందిన దుంపల కృష్ణవర్ధన్ దక్షిణభారత సైన్స్‌ఫెయిర్‌కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ చిన్నాజీ వర్మ తెలిపారు.
సోంపేట, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక మోడల్ పాఠశాలకు చెందిన దుంపల కృష్ణవర్ధన్ దక్షిణభారత సైన్స్‌ఫెయిర్‌కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ చిన్నాజీ వర్మ తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సైన్స్‌ఫెయిర్‌లో మంచి ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. త్వరలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అభి నందించారు.
జిల్లాస్థాయి ఎగ్జిబిషన్‌లో..
కంచిలి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ పురుషుల డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడి టోరియంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్ అండ్ ఎగ్జిబిషన్‌లో పోస్ట ర్ మేకింగ్ విభాగంలో మఠం సరియాపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్ధులు జామి సిరి, లిప్సా ప్రియదర్శిని ద్వితీయ బహుమతి సాధిం చారని ప్రిన్సిపాల్ శివప్రసాద్ తెలిపారు. ఈ సంద ర్భంగా బుధవారం విజేతలను ఎంఈవో చిట్టి బాబుతో పాటు ప్రిన్సిపాల్ అభినందించారు.