టీడీపీ నేత పాడె మోసిన ఎమ్మెల్యే శంకర్
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:56 PM
నిజామాబాద్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నేత గంగు ప్రభాకర్ మృతదేహానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభాకర్ అంత్య క్రియల్లో ఎమ్మెల్యే పాల్గొని పాడె మోసారు.
గార రూరల్, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నేత గంగు ప్రభాకర్ మృతదేహానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రభాకర్ అంత్య క్రియల్లో ఎమ్మెల్యే పాల్గొని పాడె మోసారు. ప్రభాకర్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, తండ్రి దాలినాయుడు ఉన్నారు. వారిని ఎమ్మెల్యే పరామర్శించి తన సానుభూతి వ్యక్తంచేశారు. తల్లి గంగు సుందరమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఏడాదిలో భార్య, కుమారుడు మృతి చెం దడంతో దాలి నాయుడును ఓదార్చడం ఎవరితరం కాలేదు. ప్రభాకర్‌ను కడసారి చూసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. మృత దేహంపై టీడీపీ జెండానుకప్పారు.