ఉపాధ్యాయుడ్ని అభినందించిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:07 AM
ఇటీవల పాతపట్నం మోడల్ స్కూల్‌లో బోటని ఉపాధ్యాయుడు బల్లెడ అప్పారావును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రత్యేకంగా అభినందించారు.
పాతపట్నం రూరల్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ఇటీవల పాతపట్నం మోడల్ స్కూల్‌లో బోటని ఉపాధ్యాయుడు బల్లెడ అప్పారావును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రత్యేకంగా అభినందించారు. అప్పారావు మాస్టర్ కళాత్మక బోధనతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారని, అంతేకాకుండా సైన్స్ ల్యాబ్‌ను విద్యార్థులకు ఆకర్షించేలా తీర్చిదిద్దడంతో ఎక్స్ వేదికగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం అతడిని సత్కరించి అభినందించారు. ఆయనతో పాటు కూటమి నాయకులు ఉన్నారు.
కార్యకర్తలకు అండగా టీడీపీ
పాతపట్నం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఇటీవల జరి గిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త కనపాల మధు కుటుం బ సభ్యులకు పార్టీ అందించిన బీమా పరిహారం మంజూరు పత్రాన్ని శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. రూ.100 చెల్లించి పార్టీ సభ్యత్వం పొందిన మధు కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మంజూరు చేశారన్నారు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ అధిష్ఠానం ముందుకు వెళ్తుందన్నారు. ఈ సంద ర్భంగా మధు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పైల బాబ్జీ, సైలాడ సతీష్, మడ్డు రామారావు, టి.తిరుపతిరావు, ఎ.సన్యాసి నాయుడు, నందిగామ ఆనందరావు తది తరులు పాల్గొన్నారు.