ఘనంగా ఎమ్మెల్యే అశోక్ జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:48 PM
ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ జన్మదిన వేడుకలు ఆదివారం కూటమి నేతల ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు.
కవిటి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ జన్మదిన వేడుకలు ఆదివారం కూటమి నేతల ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. రామ య్యపుట్టుగలోని ఆయన స్వగృ హంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్, నీలోత్పల దంప తులకు నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నేతలు శుభాకాంక్షలు తెలి పారు. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్, టీడీపీ మండల అధ్యక్షుడు పి.కృష్ణారావు, మైనార్టీ నేత బీమా రావు రౌళో, బి.రమేష్, రంగా రౌళో, ఎస్వీ రమణ, ఇచ్చాపు రం మున్సిపాలిటీ నేతలు, సోం పేట, కంచిలి మండలాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.