కానరాని బాలుడి ఆచూకీ
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:06 AM
నగరంలోని ఏడు రోడ్ల కూడలికి సమీ పంలో గల వంతెన పైనుంచి నాగావళి నదిలో శుక్రవారం రాత్రి దూకిన అలుగోలు సా యి నేతాజీ (17) ఆచూకీ శని వారం కూడా లభ్యం కాలేదు.
శ్రీకాకుళం క్రైం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఏడు రోడ్ల కూడలికి సమీ పంలో గల వంతెన పైనుంచి నాగావళి నదిలో శుక్రవారం రాత్రి దూకిన అలుగోలు సా యి నేతాజీ (17) ఆచూకీ శని వారం కూడా లభ్యం కాలేదు. నగరంలోని గుజరాతీపేట శి వాలయంవీధికి చెందిన ఉ మారుద్ర కోటేశ్వరరావు కుమారుడు సాయినేతాజీ. శుక్రవా రం సాయంత్రం బయటకు వెళ్లిన నేతాజీ ఆలస్యంగా ఇంటికి రావడంతో అతడి తండ్రి మందలించాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన నేతాజీ సమీపంలో గల బ్రిడ్జిపై నుంచి నాగావళి నదిలోకి దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది నది పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రెండో రోజు శనివారం కూడా గాలింపు చర్యలు చేప ట్టినా ఫలితం లేకపోయింది. కాగా నేతాజీ అదృశ్యంపై తండ్రి కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్‌ఐ లక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.