Share News

కోటబొమ్మాళి అభివృద్ధికి సహకరించాలి: మంత్రి

ABN , Publish Date - Oct 24 , 2025 | 11:59 PM

కోట బొమ్మాళి పంచాయతీ అభివృద్ధికి అందరూ సహక రించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కో రారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయ అవరణలో గ్రామపెద్దలు, అధికారులతో సమీక్షిం చారు. ఈసందర్భంగా డిసెంబరు31 నాటికి పూర్తి స్థాయిలో ఇంటిపన్ను వసూళ్లు చేయాలని ఈవో చింతాడ సన్యాసిరావుకు ఆదేశించారు.గత ప్రభుత్వ పాలకులకు అవగాహన లేక పంచాయతీ భవనానికి ఎదురుగా మరోభవనం నిర్మించడంతో రాకపోకలకు అం

  కోటబొమ్మాళి అభివృద్ధికి సహకరించాలి: మంత్రి
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు:

కోటబొమ్మాళి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): కోట బొమ్మాళి పంచాయతీ అభివృద్ధికి అందరూ సహక రించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కో రారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయ అవరణలో గ్రామపెద్దలు, అధికారులతో సమీక్షిం చారు. ఈసందర్భంగా డిసెంబరు31 నాటికి పూర్తి స్థాయిలో ఇంటిపన్ను వసూళ్లు చేయాలని ఈవో చింతాడ సన్యాసిరావుకు ఆదేశించారు.గత ప్రభుత్వ పాలకులకు అవగాహన లేక పంచాయతీ భవనానికి ఎదురుగా మరోభవనం నిర్మించడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో ఆ భవనాన్ని కూలదోయాలని అధికారులను ఆదేశించారు. కొతమ్మతల్లి ఆలయ అభివృద్ధికిమరో ఐదుకోట్లు మంజూరుకోసం ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. కొత్తగా వాండ్రాడ పంచాయతీ నర్సింగపల్లి వద్ద రూ.3.5 కోట్లు సబ్‌స్టేషన్‌ మంజూరయ్యిందన్నారు. అలాగే పలువురి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. పంచాయతీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో డీపీవో భారతి సౌజన, ఆర్డీవో కృష్ణమూర్తి, డీఎల్‌పీవో ఐవీ రమణ, తహసీల్దార్‌ అప్పలరాజు, ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌, మండల ఇంజనీరింగ్‌ అధికారి అంజిత్‌కు మార్‌, నాయకులు కింజరాపు హరివరప్రసాద్‌, బగాది శేషగిరి, బోయిన రమేష్‌, కల్లి నాగయ్యరెడ్డి, లక్షణరెడ్డి, గోవిందరావు, రాంకుమార్‌, గోవింద పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 11:59 PM