కనీస వేతనాలు అమలు చేయాలి
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:37 PM
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్నా భోజన వంట కార్మికులకు, శానిటేషన్ కార్మికులకు గౌరవ వేతనం రూ.20 వేలు అమలు చేయాలని ఎండీఎం కార్మికుల సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఆర్.సురేష్‌బాబు డిమాండ్ చేశారు.
నరసన్నపేట, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్నా భోజన వంట కార్మికులకు, శానిటేషన్ కార్మికులకు గౌరవ వేతనం రూ.20 వేలు అమలు చేయాలని ఎండీఎం కార్మికుల సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఆర్.సురేష్‌బాబు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎమ్మార్సీ భవనం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, శ్రమకు తగిన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండల కమిటీ సభ్యులు ఎ.రాధ, ఆర్.కాంతమ్మ, నాగమణి రత్నం, సూరమ్మ, విజయకుమారి, సరస్వతి, సుమలత, సంతోషి కుమారి, జ్యోతి, నవీనా, దేవి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.