ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనాలివ్వాలి
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:39 PM
రాష్ట్రంలో మునిసిపల్ ఇంజనీ రింగ్ కార్మికులకు కనీస వేతనా లివ్వాలని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు టి.తిరు పతిరావు, అధ్యక్ష, కార్య దర్శులు వేణుగోపాల్, కల్యాణ అప్పలరాజు డి మాండ్ చేశారు.
శ్రీకాకుళం అర్బన్/ ఇచ్ఛాపురం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మునిసిపల్ ఇంజనీ రింగ్ కార్మికులకు కనీస వేతనా లివ్వాలని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు టి.తిరు పతిరావు, అధ్యక్ష, కార్య దర్శులు వేణుగోపాల్, కల్యాణ అప్పలరాజు డి మాండ్ చేశారు. సంఘం రాష్ట్ర విభాగం పిలు పుమేరకు సోమవారం శ్రీకాకుళం, ఇచ్ఛాపురం లో నిరసన చేపట్టారు. రిటైరైన మునిసిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. యూనియన్ నాయకులు జయశ్రీ, రాజ్యలక్ష్మి, మాధురి పాల్గొన్నారు.