Share News

మినీ మహానాడును విజయవంతం చేయాలి

ABN , Publish Date - May 17 , 2025 | 12:22 AM

ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఈ నెల 20న నిర్వహించే మినీ మహానాడును వి జయవంతం చేయాల ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

మినీ మహానాడును విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

ఎచ్చెర్ల, మే 16 (ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఈ నెల 20న నిర్వహించే మినీ మహానాడును వి జయవంతం చేయాల ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. చిలకపాలెంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మినీ మహానాడు ఏర్పాట్లు, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై శుక్రవారం నిర్వహించిన పా ర్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మినీ మహానాడు కార్యక్రమం నియోజకవర్గంలో ఆర్భాటంగా జరిగాలని, రాష్ట్రం మొత్తం మనవైపు చూసేలా నిర్వ హించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు చౌదరి అవినాష్‌, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భువనేశ్వరరావు, కూటమి నాయకులు బెండు మల్లేశ్వరరావు, ముప్పిడి సురేష్‌, లంక శ్యామ్‌, పైడి ముఖలింగం, గూరు జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఎంపీ ప్రజా దర్బార్‌ను నిర్వహించి వినతులను స్వీకరించి, అక్కడకక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి చొరవ చూపారు.

Updated Date - May 17 , 2025 | 12:22 AM