కుటుంబ పోషణ కోసం వలస వెళ్లి
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:06 AM
మండల పరిధి గెద్దలపాడు గ్రామానికి చెందిన నక్క నరసింహారావు(49) అనారోగ్యంతో అబుదాబీలో మృతి చెందాడని కుటుంబ స భ్యులు తెలిపారు.
అబుదాబిలో గెద్దలపాడు వాసి మృతి
మృతదేహాన్ని తెప్పించాలంటూ భార్య వేడుకోలు
కంచిలి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): మండల పరిధి గెద్దలపాడు గ్రామానికి చెందిన నక్క నరసింహారావు(49) అనారోగ్యంతో అబుదాబీలో మృతి చెందాడని కుటుంబ స భ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. నర సింహారావు నెల రోజుల కిందట అబుదాబీలో ఎన్‌ఏఎస్‌హెచ్ కంపెనీలో వెల్డర్‌గా పనికి వెళ్లాడు. బుధవారం సాయంత్రం భార్యకు ఫోన్ చేసి తనకు కడుపునొప్పిగా ఉందని, ఆసుపత్రికి వెళుతున్నానని చివరిసారిగా మాట్లాడాడు. శుక్రవారం అర్ధరాత్రి కంపెనీ నుంచి నరసింహారావు మృతి చెందినట్టు సమాచారం ఇచ్చినట్టు భార్య నారాయణమ్మ తెలిపారు. నర సింహారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడు మాఽ దవ్ మానసిక వికలాంగుడు. చిన్నకుమారుడు నీరజ్ ఐటీఐ చదువుతున్నాడు. కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని నెల రోజుల కిందట అప్పులు చేసి అబుదాబి వెళ్లిన నరసింహారావు ఇంతలోనే మృతి చెందిన విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె ఎమ్మెల్యే బెందాళం అశోక్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయిడు, అధికారులను వేడుకుంటోంది.