యోగాతో మానసిక ప్రశాంతత
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:51 PM
యోగా సాధనతో మానసిక ప్రశాంతతతోపాటు పరిపూర్ణమైన ఆరోగ్యం పొందవచ్చునని విజయన గరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనా యుడు అన్నారు.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
యోగాంధ్ర విజయవంతానికి ఆదిత్యునికి పూజలు
సైకిల్‌పై ర్యాలీగా విశాఖ బీచ్‌కు పయనం
అరసవల్లి/రణస్థలం, జూన్ 20(ఆంధ్రజ్యోతి): యోగా సాధనతో మానసిక ప్రశాంతతతోపాటు పరిపూర్ణమైన ఆరోగ్యం పొందవచ్చునని విజయన గరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనా యుడు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయ ణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ ఈవో ప్రసాద్ ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదిం చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖలో ప్రధాని మోదీ సమక్షంలో ఐదు లక్షల మందితో జరుగనున్న యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో సూర్య నమస్కారాలు, యోగా సాధన చేశారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో కేఎన్‌వీడీ ప్రసాద్ అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా అందరి జీవితాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు. మానసిక, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఒక దివ్య ఔషధమని అన్నారు. అనంతరం ఆయన సైకి ల్‌పై విశాఖ బీచ్‌లో శనివారం ఉదయం నిర్వహించ నున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సైకిల్ పై ర్యాలీగా బయలుదేరారు. కార్యక్రమంలో ఆలయ సీని యర్ అసిస్టెంట్ వెంకటరమణ, జూనియర్ అసిస్టెంట్లు బీఎస్ చక్రవర్తి, బాలభాస్కర్, అర్చకులు ఇప్పిలి సాందీప శర్మ, నేతింటి హరిబాబు, తదితరులు పాల్గొన్నారు. రణ స్థలం మండలానికి సైకిల్ ర్యాలీగా చేరుకున్న ఎంపీ కలిశెట్టిని టీడీపీ మండల అధ్యక్షుడు లంక శ్యామలరా వు, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు పిన్నింటి భా నోజీనాయుడు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. కోష్ఠలో మాజీ సర్పంచ్ పిసిని జగన్నాథనాయుడు ఆధ్వ ర్యంలో, పైడిభీమవరంలో స్వాగతం పలికారు.
యోగా జీవితంలో భాగం కావాలి: ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, జూన్ 20(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగంకావాలని ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు. శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీ పాన ప్రధాన రహదారిపై మాక్ యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ యో గా దినోత్సవం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్న యోగాంధ్రలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, నారాయణ పురం ప్రాజెక్టు చైర్మన్ సనపల ఢిల్లీశ్వరరావు, టీడీపీ నాయకులు మొదలవలస రమేష్, డాక్టర్ చాపర సుధాకర్, బోర గోవిందరావు, తంగి గురయ్య, శ్రీదేవి, మునిసి పల్ కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు.