yoga యోగాతో మానసిక ప్రశాంతత
ABN , Publish Date - May 23 , 2025 | 11:55 PM
yoga యోగాతో మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎంపీడీవో కె.అప్పలనాయుడు అన్నారు.
జలుమూరు, మే 23 (ఆంధ్రజ్యోతి): యోగాతో మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎంపీడీవో కె.అప్పలనాయుడు అన్నారు. యోగాంధ్రలో భాగంగా శుక్రవారం స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది కార్యాలయం తెరచిన వెంటనే అరగంట సమయం యోగాకు కేటాయించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల 21 వరకు కార్యాలయాల్లో ఉదయం తప్పనిసరిగా యోగా చేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యానవనశాఖ అధికారి మంగమ్మ, వ్యవసాయాధికారి కె.సురేష్, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.