ఆఽధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:11 AM
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. మండలంలోని పిరిడిలో సత్యసాయిబాబా మందిరాన్ని పునర్నిర్మించారు.
బొబ్బిలి రూరల్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. మండలంలోని పిరిడిలో సత్యసాయిబాబా మందిరాన్ని పునర్నిర్మించారు. ఈ మేరకు ఆది వారం మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడు తూ గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్ర మాలతో ప్రశాంతత నెలకొం టుందని తెలిపారు. కాగా సత్యసాయి మండలి సౌజన్యంతో నెల్లిమర్లలోని మిమ్స్ ఆధ్వర్యంలో వైద్యనిపుణులు 150 మందికి వైద్యసేవలందించారు.కార్యక్రమంలో మందిర ట్రస్టీ కొల్లి చలం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.