Share News

త్రోబాల్‌ పోటీలకు మెళియాపుట్టి ఎంపిక

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:59 PM

జిల్లాస్థాయిలో త్రోబాల్‌ పోటీలకు మెళియా పుట్టి మండలం ఎంపికయ్యింది. మంగళవారం టెక్కలిలోని మహాత్మాగాంధీ జ్యోతిరా వుపూలే పాఠశాల ప్రాంగణంలో డివిజన్‌లోని ఉపాధ్యాయినుల త్రోబాల్‌ పోటీలను ఎంఈవోలు డి.తులసీరావు, చిన్నారావు, ప్రిన్సిపాల్‌ టి.సుఽధారాణి ప్రారంభించారు.

  త్రోబాల్‌ పోటీలకు మెళియాపుట్టి ఎంపిక
టెక్కలి: త్రోబాల్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయినులు

టెక్కలి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి):జిల్లాస్థాయిలో త్రోబాల్‌ పోటీలకు మెళియా పుట్టి మండలం ఎంపికయ్యింది. మంగళవారం టెక్కలిలోని మహాత్మాగాంధీ జ్యోతిరా వుపూలే పాఠశాల ప్రాంగణంలో డివిజన్‌లోని ఉపాధ్యాయినుల త్రోబాల్‌ పోటీలను ఎంఈవోలు డి.తులసీరావు, చిన్నారావు, ప్రిన్సిపాల్‌ టి.సుఽధారాణి ప్రారంభించారు. విజేతగా మెళియాపుట్టి మండలం, రన్నర్‌గా పాతపట్నం, తృతీయ స్థానం టెక్కలి మండల ఉపాధ్యాయినులు నిలిచారు. కార్యక్రమంలో స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఇన్‌ చార్జి బి.నారాయణరావు, మెళియాపుట్టి ఎంఈవో దేవేంద్రరావు, కృషారావు, తిరుపతి రావు, వాసుదేవరావు, గోవిందు, ఆదిశేషు, జగదీష్‌, రామిరెడ్డిలు పాల్గొన్నారు.

గణిత పరీక్షల్లో ప్రతిభచాటిన విద్యార్థులు

కాశీబుగ్గ,డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ జడ్పీ హెచ్‌స్కూల్‌ విద్యార్థులు మం డల స్థాయిలో జరిగిన గణిత పరీక్షల్లో ప్రతిభ చాటారు. మూడు తరగతుల స్థాయిలో జరిగిన పరీక్షల్లో పదోతరగతి నుంచి కీర్తిపండా మొదటిస్థానం సాధించగా, కేశవరావు, కార్తీక్‌, పూర్ణచంద్రరావులు ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్‌ బహుమతులు సాధించారు. తొమ్మిదోతరగతి నుంచి మనోహర్‌ ప్రథమస్థానం సాధించగా, కళ్యాణ్‌ ద్వితీయ స్థానం, ఎనిమిదోతరగతి నుంచి కిల్లి శరణ్‌ మొదటిస్థానం, హర్షవర్ధన్‌,సాయివర్షిత్‌లు ద్వితీయ,తృతీయ స్థానాలు సాధించారు.ఈసందర్భంగా ప్రతిభ సాధించిన విద్యార్థుల ను హెచ్‌ఎం చిన్నంనాయుడు,గ ణిత ఉపాఽధ్యాయులు కిల్లి వెంకటరావు, తారక రామా రావు, ఛాయామోహన్‌, వెంకటరావు, కిషోర్‌,నిర్మలు అభినందించారు.

Updated Date - Dec 16 , 2025 | 11:59 PM