Share News

పండుగలా మెగా పేరెంట్స్‌ మీటింగ్‌: జేసీ

ABN , Publish Date - Jul 09 , 2025 | 11:45 PM

ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో గురు వారం మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ పండుగ వాతావర ణంలో నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ ఆదేశించారు.

పండుగలా మెగా పేరెంట్స్‌ మీటింగ్‌: జేసీ
ఉపాధ్యాయులు, అధికారులకు సూచనలిస్తున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

గార జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో గురు వారం మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ పండుగ వాతావర ణంలో నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ ఆదేశించారు. బుధవారం స్థానిక జడ్పీ ఉన్న త పాఠశాలను సందర్శిం చారు. పేరేంట్స్‌ మీటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీ లించి పలు సూచ నలను ఇచ్చారు. పాఠశాల కమిటీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమష్టిగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సదు పాయా లను వివరించాలని, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. కార్యక్ర మంలో ఇన్‌చార్జి ఎంపీడీవో ఐ.రఘు, తహసీల్దార్‌ ఎం.చక్రవర్తి ఎంఈవో నక్క రామకృష్ణ, హెచ్‌ఎం పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 11:46 PM