మెగా అభిమానుల రక్తదానం
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:03 AM
సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అభిమానుల ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు.
అరసవల్లి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అభిమానుల ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక శ్రీ ఫంక్షన్ హాల్లో శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంకు సహకారంతో 126 మంది రక్తదానం చేశారు. ఈ సంద ర్భంగా రక్తదాతలను ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందించారు. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడవచ్చన్నారు. చిరంజీవి స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. అలాగే జిల్లాస్థాయి డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను, గురుగుబిల్లి లోకనాథం, బ్లడ్‌బ్యాంకు మేనేజర్ మణికంఠ, వైశ్యరాజు మోహన్ తదితరులు పాల్గొన్నారు.