Share News

DSC: విజయీభవ

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:14 AM

Teacher Recruitment ‘మెగా డీఎస్సీ’ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 37,892 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

DSC: విజయీభవ

  • నేటి నుంచి ‘మెగా డీఎస్సీ’

  • జిల్లాలో ఆరు కేంద్రాల్లో నిర్వహణ

  • హాజరుకానున్న 37,982 మంది అభ్యర్థులు

  • పకడ్బందీగా ఏర్పాట్లు

  • శ్రీకాకుళం, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ‘మెగా డీఎస్సీ’ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 37,892 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ సీఎంసీ చూస్తుండగా... ఎచ్చెర్లలో రెండు సెంటర్లు, నరసన్నపేట, బరంపూర్‌, టెక్కలి, రాజాంలో ఒక్కో సెంటర్‌ను కేటాయించారు. మొత్తం 178 సెషన్లతో పరీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంటన్నర ముందుగానే చేరుకోవాలి. నిర్ణీత సమయానికి అరగంట ముందుగానే పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు. ప్రతి సెంటర్‌కు డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ను నియమించారు. అభ్యర్థులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా తక్షణ సహాయం అందించేందుకు జిల్లా సహాయ కేంద్రాన్ని నెలకొల్పారు. 9703148269-ఏడీ, 9505678655-ఏసీజీఈ, 8919212126-సీనియర్‌ అసిస్టెంట్‌, 9177975250 కంప్యూటర్‌ ఆపరేటర్‌ నంబర్లను సంప్రదించవచ్చు. పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులందరికీ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

  • కేంద్రం అభ్యర్థుల సంఖ్య

    ......................................................................................................

  • నరసన్నపేట(కోర్‌ టెక్నాలజీస్‌) 12,478

  • ఎచ్చెర్ల(శ్రీ వెంకటేశ్వర కాలేజీ) 3,755

  • ఎచ్చెర్ల(శ్రీ శివానీ కాలేజీ - చిలకపాలెం) 7,790

  • బరంపూర్‌(స్మిత్‌ ఆన్‌లైన్‌ సెంటర్‌) 1,375

  • టెక్కలి(ఆదిత్య ఇనిస్టిట్యూట్‌ టెక్నాలజీ) 4,389

  • రాజాం(జీఎంఆర్‌ఐ టెక్నాలజీ) 8,195

  • ......................................................................................................

    మొత్తం : 37,982

  • ......................................................................................................

Updated Date - Jun 06 , 2025 | 12:14 AM