కారు ఢీకొని మెడికో విద్యార్థినికి గాయాలు
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:00 AM
కారు ఢీకొనడంతో ఓ మెడికో విద్యార్థినికి గాయాలవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
ఔదార్యం చాటుకున్న ఎమ్మెల్యే రవికుమార్
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కారు ఢీకొనడంతో ఓ మెడికో విద్యార్థినికి గాయాలవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం రిమ్స్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న పోతుల జాహ్నవి పీఎన్ కాలనీలో ఉన్న వేంకటేశ్వర ఆలయానికి వెళ్లి శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై తన స్నేహితుడితో కలిసి తిరిగి వస్తుండగా శాంతినగర్ కాలనీలోని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇంటి వద్ద ఓ కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. ఆ సమయంలో ఇంటి వద్ద ఉన్న ఎమ్మెల్యే రవికుమార్ వెంటనే స్పందించి చికిత్స కోసం తన కారులో ఆ విద్యార్థినిని రిమ్స్‌కు తీసుకొని వెళ్లి చికిత్సను అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. మెడికో విద్యార్థిని పోతుల జాహ్నవి ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్‌ఐ దొర ఆదివారం కేసు నమోదు చేశారు.
నడిచివెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న కారు
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): నగరంలోని సూర్యమహల్ జంక్షన్ వద్ద నడుచుకొని వెళుతున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో గాయాలైన సంఘ టనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. న్యూకాలనీ వద్ద టీ దుకాణంలో పనిచేస్తున్న అలికాన లక్ష్మణరావు దుకాణానికి వెళ్లేందుకు నడుచుకొని వెళుతూ రోడ్డు దాటుతుండగా ఏడు రోడ్ల జంక్షన్ నుంచి వస్తున్న గుర్తు తెలియని కారు వెనుక నుంచి ఢీకొనడంతో లక్ష్మణరావుకు గాయాల య్యాయి. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్‌ఐ మెట్ట సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.