రైతు సేవా కేంద్రంలో వైద్య సేవలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:08 AM
మండలంలోని బమ్మిడి కాలనీలో గల ఆరోగ్యఉపకేంద్రం రైతుసేవాకేంద్రంలో(ఆర్‌ఎస్‌కే) నిర్వహిస్తున్నారు. ఆరోగ్య ఉపకేంద్రాన్ని దశాబ్దకాలం కిందట ప్రభుత్వం రూ.13 లక్షలు వెచ్చించి భవనం నిర్మించారు.
కొత్తూరు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి):మండలంలోని బమ్మిడి కాలనీలో గల ఆరోగ్యఉపకేంద్రం రైతుసేవాకేంద్రంలో(ఆర్‌ఎస్‌కే) నిర్వహిస్తున్నారు. ఆరోగ్య ఉపకేంద్రాన్ని దశాబ్దకాలం కిందట ప్రభుత్వం రూ.13 లక్షలు వెచ్చించి భవనం నిర్మించారు. ఇక్కడి ఆరోగ్య ఉపకేంద్రం చుట్టూ ఉన్న స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. వర్షం, వాడుకనీరు వేళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఆరోగ్యకేంద్రం ఎదురుగా రహదారిపై బురద, ము రుగు నీరు నిల్వఉండడంతో ప్రజలు వెళ్లేందుకు సరైన మార్గం లేకుం డాపోయింది.బురద సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఆరోగ్య ఉపకేంద్రం మూసివేసి రైతుసేవా కేంద్రానికి (ఆర్‌ఎస్‌కే) తరలించాల్సి వచ్చింది.ఈనేపథ్యంలో ఆ భవనం అలంకారప్రాయంగా దర్శనమిస్తోంది.అయితే ఆర్‌ఎస్‌కే శ్మశానవాటికకు ఆనుకుని ఉండడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులను వైద్యం కోసం తీసుకువచ్చేందుకు భయాందోళన చెందుతున్నారు.రైతు సేవాకేంద్రంలో ఒకగదిలో వ్యవ సాయ పనిముట్లు, విత్తనాలు, ఇతర సామగ్రి ఉన్నాయి. మరో గదిలో వైద్యం కోసం వచ్చే వారికి సేవలు అందిస్తున్నారు. అయితే ఇరుగ్గాఉండే గదుల్లో సామగ్రి నిల్వఉండడంతో ఇక్కడకు వచ్చే రోగులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.కాగా ఆరోగ్యఉపకేంద్రం సమస్య తన దృష్టికి వచ్చిందని కురిగాం ఆసుపత్రి వైద్యాధికారి పెద్దిని ప్రసన్న కుమార్ తెలిపారు. సమస్యను మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిం చాలని కోరునున్నట్లు చెప్పారు.