ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు
ABN , Publish Date - May 10 , 2025 | 11:47 PM
దేవదాయశాఖ,ట్రస్టుల పరిధిలో ఉన్న ఆలయాల భూముల పరిరక్షణకు ప్ర భుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు.
పొందూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): దేవదాయశాఖ,ట్రస్టుల పరిధిలో ఉన్న ఆలయాల భూముల పరిరక్షణకు ప్ర భుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. పొందూరులోని శాలిహుండాం వేణు గోపాలస్వామి భూములను పరిరక్షిం చాలని ఆ ట్రస్టు చైర్మన్ సుగ్గు మధు రెడ్డి శనివారం రవికుమార్‌కు పెను బర్తిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వందేవుని భూము ల రక్షణలో చిత్తశుద్ధితో ఉందని, ఆక్రమ ణలకు గురైన భూములపై సర్వే జరిపి తిరిగి దేవదాయశాఖ, ట్రస్టులకు అందిం చేలా చర్యలుతీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలిపా రు.పొందూరులోని శాలిహుండాం ట్రస్టుకు 198 సర్వేనంబరులో 1.47 ఎకరాలు, 241లో 98 సెంట్లు, 6-3లో 3.18 ఎకరాలు, 173లో 2.87 ఎకరాల భూముల ఉన్నా యని, ప్రస్తుతం చాలాభూములు అన్యాక్రాంతంలో ఉన్నాయని మధురెడ్డి వివరిం చారు.వాటికి సంబందించి రెవెన్యూపత్రాలు ఉన్నాయని తెలిపారు.ట్రస్టుకు శాశ్వత ఆదాయంకోసం భూములను చట్టప్రకారం వినియోగించాలని మధురెడ్డికి రవికు మార్ సూచించారు. ట్రస్టుభూముల రక్షణకు తీసుకున్న చర్యలకు తాను అండగా ఉంటానని మధురెడ్డికి భరోసాఇచ్చారు.దేవాదాయశాఖ కమిషనర్‌తో తాను మాట్లా డతానని భూముల రక్షణకు అవసరమైతే పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగించాలని సూచించారు.