నీటి ఎద్దడి త లెత్తకుండా చర్యలు
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:59 PM
గ్రామాల్లో తాగునీటి ఎద్దడితలెత్తకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
కోటబొమ్మాళి,ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి):గ్రామాల్లో తాగునీటి ఎద్దడితలెత్తకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.అంబేడ్కర్ వర్సిటీ రూ.38 కోట్లతో నిర్మించిన పరిపాలన భవనం శుక్రవారంముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా ప్రారంభోత్సవం చేయడానికి ఏర్పాట్లు పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ మేరకు మంత్రిని ఆచార్యులు జీవీకే రజిని, సుజాత, సామ్రాజ్య లక్ష్మి కలిశారు.టెక్కలి మండలంలోని అక్కువరానికి చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చాలని కోరారు.అలాగే సహాయ న్యాయవాధిగా నియమితులైన గొద్దు భాగ్యలక్ష్మి బీజేపీ నాయకులు రవి బాబ్జి, రాంజీతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు కలిశారు.