రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:42 PM
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొ న్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని, వీటికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన వారి జరిమానా వివరాలను ఆయన వెల్లడిం చారు. కాశీబుగ్గ, టెక్కలి, మెళియా పుట్టి స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో 33 మంది పట్టు బడగా వారికి సంబంధిత కోర్టులు జరిమానా విధించాయన్నారు. కాశీబుగ్గ, పలాస మండలంలో మద్యం సేవించి వాహ నాలు నడిపిన ముగ్గురు వాహనచోదకులను కోర్టులో హాజరుపర్చగా టెక్కలి జ్యూడీ షియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి యు. మాధురి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున జరిమానా విధించారన్నారు. అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి న్యూసెన్స్ సృష్టించిన 18 మందికి ఒక్కొక్కరికి రూ.1000 వంతు జరిమానా విధించినట్లు తెలిపారు. టెక్కలి పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహ నాలు నడిపిన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున, మెళియాపుట్టి స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాల నడిపిన ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమా నా విధించార న్నారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన ఏడుగురికి రూ.1000 చొప్పున జరిమానా విధించారని ఎస్పీ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి రోజూ జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి వాటిపై తని ఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటువంటి కేసుల్లో జరిమానాలు మాత్ర మే కాకుండా తరచూ పట్టుబడిన వారికి జైలు శిక్ష తప్పదని ఎస్పీ హెచ్చరించారు. ప్రజల భద్రత నిమిత్తం ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన ఆ ప్రకటనలో సూచించారు.