Share News

సాగు నీరందించేందుకు చర్యలు

ABN , Publish Date - Jun 15 , 2025 | 10:59 PM

మడ్డువలస కాలువ ద్వారా ఖరీఫ్‌కు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు(ఎన్‌ఈఆర్‌) తెలిపారు. ఆదివారం జి.సిగడాం, పొందూరు మండలాల సరిహద్దులో బొట్టపేట వద్ద గల మడ్డువలస కాలువను ఆయన పరిశీలించారు.

  సాగు నీరందించేందుకు చర్యలు
మడ్డువలస కాలువను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

జి.సిగడాం, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): మడ్డువలస కాలువ ద్వారా ఖరీఫ్‌కు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు(ఎన్‌ఈఆర్‌) తెలిపారు. ఆదివారం జి.సిగడాం, పొందూరు మండలాల సరిహద్దులో బొట్టపేట వద్ద గల మడ్డువలస కాలువను ఆయన పరిశీలించారు. మడ్డువలస కాలువ ఏర్పడినప్పటి నుంచి తమ గ్రామ పరిధిలోని ఆయకట్టుకు నీరందడంలేదని వాండ్రంగి గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.దీంతో స్పందించిన ఎమ్మెల్యే రైతులు, మడ్డువలస ప్రాజెక్టు అధికారులతో సమీక్షించారు. ఆయన వెంట ఎస్‌ఈ పొగిరి సుగుణాకరరావు, డీఈఈ నాగేశ్వరరావు, ఏఈ రాజశేఖర్‌, నాయకులు కుమరాపు రవికుమార్‌, బూరాడ వెంకటరమణ, వజ్జపర్తి రఘరాం, పైల విష్నుమూర్తి, సాకేటి నాగరాజు, బాలబొమ్మ వెంకటేశ్వరరావు, డాక్టర్‌ చింత మల్లేశ్వరరావు, ముప్పిడి సురేష్‌ ఉన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 10:59 PM