Share News

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:40 PM

ధాన్యం కొనుగో లు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
శ్రీకాకుళం రూరల్‌: రైతులకు మినుము విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌, నవంబరు18 (ఆంఽధ్ర జ్యోతి): ధాన్యం కొనుగో లు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. రూరల్‌ మండ లం లంకాం గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రాల వద్ద తాగునీరు, విశ్రాంత గదులు, గింజల ఎండ బెట్టే స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యాన్ని దళారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రా ల్లో విక్రయించాలని రైతులకు సూచించారు. అనం తరం రైతులకు మినుము విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ బి.రజని, తహసీ ల్దార్‌ ఎం. గణపతి, ఏవో పి.నవీన్‌, ఎంపీడీవో వి.ప్రకాశరావు, టీడీపీ నేత మూకళ్ల శ్రీనివాస రావు, సర్పంచ్‌ చిట్టి రవి, పలువురు రైతులు పాల్గొన్నారు.

ప్రతి ధాన్యం గింజా కొనుగోలు: శివ్వాల

సరుబుజ్జిలి, నవంబరు 18 (ఆంధ్ర జ్యోతి): ఖరీఫ్‌లో సాగుచేసిన రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజా కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసు కుందని డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్య నారాయణ అన్నారు. మంగళ వారం కొత్తకోట సహకార సంఘ ఆధ్వర్యంలో చిన్న కాగితా పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నా రు. అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ నిధులు జమవుతాయ న్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదన్‌, ఏవో కె.మన్మఽథ రావు, డీటీ సత్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు అంబళ్ల రాం బాబు, నాయకులు వెలమల రమేష్‌, కూటికుప్పల కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 11:40 PM