సామాజిక న్యాయానికి కులగణన చేపట్టాలి
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:39 PM
సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం జనగణనలో కుల గణన చేపట్టాలని సీపీఎం జిల్లా సమితి సభ్యుడు టి.తిరుపతిరావు, బొత్స సంతోష్ డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం అర్బన్/సరుబుజ్జిలి, నవంబరు 18 (ఆంధ్ర జ్యోతి): సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం జనగణనలో కుల గణన చేపట్టాలని సీపీఎం జిల్లా సమితి సభ్యుడు టి.తిరుపతిరావు, బొత్స సంతోష్ డిమాండ్ చేశారు. మంగళ వారం శ్రీకాకుళం, సరుబుజ్జిలిలో నిరసన కార్యక్రమం చేపటా ్టరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 2026లో జరిగే జనగణనలో కులగణన చేపట్టాలన్నారు. ఇప్ప టికే దళితులు, గిజనులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు పట్టించు కోవడం లేదని విమర్శించారు. సామా జిక న్యాయం, ఆత్మగౌరవం కోసం రాజకీయ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత స్థానం కల్పించాలంటే జనగణనతో కులగణన నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమాల్లో బీఎస్పీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీ మల్లేశ్వరరావు, కె.రిన్నారావు, కార్మిక సంఘాల సీనియర్ నాయకుడు చిక్కాల గోవిందరావు, కులనిర్మూలన పోరాట సంఘ కార్యదర్శి జగన్నాథం, సఫాయి కర్మచారి సంఘం నుంచి ఎ.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.