Share News

Minister Atchannaidu: పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:13 AM

Minister Atchannaidu:పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ రంగాన్ని జిల్లాలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.

Minister Atchannaidu:   పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

- మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ రంగాన్ని జిల్లాలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్‌ భవన్‌లో పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్కలిలో పట్టు మహాదేవ్‌ కోనేరు, భావనపాడు బీచ్‌, కొత్తపేట కొండతో పాటు టెక్కలిలో దివంగనేత కింజరాపు ఎర్రన్నాయుడు పార్కు అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నక్షత్‌ హోటళ్లు ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఆహ్లాదకర వాతావరణం, గ్రీనరీ, చిన్నారులు ఆడుకునేందుకు పార్కు వంటివి ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఈ రమణ, జేఈ మన్మథరావు, జిల్లా పర్యాటకు అధికారి నారాయణరావు, త దితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:13 AM